Saturday, 1 December 2012


పూరి జగన్నాథ్ పై గౌరవాన్ని పెంచిన రాంబాబు

1) 'రాంబాబు' సినిమాలో పూరి జగన్నాథ్ రాజకీయ నాయకులను ఏకి పాడేసాడు.
2) ఉద్యమం అంటే పక్కోడి తల్లిని తిట్టడం కాదు, తల్లి ఎవరికైనా తల్లి. తల్లిని గౌరవించు. అని చాలా బాగా చెప్పాడు.
3) తెలంగాణ ప్రజలను కాని, తెలంగాణ ఉద్యమాన్ని కాని, తెలంగాణ ఉద్యమ నాయకులను ఎక్కడా అగౌరవ పరచలేదు.
తెలంగాణ ఉద్యమాన్ని అడ్డుపెట్టుకొని లబ్ది పొందాలనుకునే స్వార్ద రాజకీయ నాయకులకు తగిలి వుండవచ్చు.
రాజకీయ నాయకులు రాద్దాంతం చేసారు. దానితో గర్వంగా పబ్లిసిటి చేద్దామనుకున్న మేకర్స్ పబ్లిసిటికి బ్రేక్ పడింది. సినిమా గురించి మాట్లాడితే ఆ నాయకులకు ఇంకా రెచ్చగోట్టినట్టు అవుతుందని సినిమాను గాలికి ఓదిలేసారు. టి.వి లోకి వాళ్ళు వచ్చి వీళ్ళు వచ్చి ఇది బాగుంది అది బాగుందని చెప్పడం అసలు జరగలేదు. ఇదే అదనుగా రాంబాబు హేటర్స్ అందరూ సినిమాపై ఇష్టం వచ్చినట్టు దుష్పాచారం మొదలుపెట్టారు.
My point is:
అసలు ప్రజల మనోభావాలు దెబ్బతినని సినిమాపై దాడులు చెయ్యడం వలన, నిజంగా ప్రజల మనోభావాలు దెబ్బతినే సినిమాలు వచ్చినప్పుడు ప్రజలు ఆగ్రహించినా, ఏది నిజమో తెలియక లైట్ గా తీసుకోవాల్సి వస్తుంది.
"భూతద్దంలో చూసి ఎదో ఒక వర్గం వారు మా మనోభావాలు దెబ్బతిన్నాయనడం సరికాదు, సినిమాను సినిమాగా చూడాలన్నది" నిజమే. అదే విధంగా ఇది సినిమానే కదా లిమిట్ లేకుండా కులాలు, ప్రాంతాలు మీద వెటకారం చేస్తాం అనటం సరి కాదు.
bottom line:
పూరి జగన్నాథ్ పై గౌరవాన్ని పెంచాడు మన రాంబాబు

No comments:

Post a Comment