'గబ్బర్ సింగ్' దబాంగ్ కాపీ అంటే ఒప్పుకొని హరీష్ శంకర్

పవన్ కళ్యాన్ 'తమ్ముడు' - అమీర్ ఖాన్ jo jeeta wohi sikandar సినిమాకు ఆఫీషియల్ రీమేక్.(హిందీ సినిమా రీమేక్ రైట్స్ కొనుక్కొని తెలుగులో తమ్ముడు సినిమాగా చేసారు)
పవన్ కళ్యాన్ 'ఖుషి' - తమిళ్ సినిమాకు రీమేక్.
BUT, ఎవరైనా ఈ రెండు సినిమాలను రిమేక్స్ అంటే నాకు కాలిపోద్ది.
ఎందుకంటే తమిళ్ ఖుషి రోజే తెలుగు ఖుషి సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యింది. అప్పట్లో పవన్ కళ్యాణ్ స్లోగా చేసేవాడు కాబట్టి, తమిళ్ షూటింగ్ అయిపోయేదాకా వెయిట్ చేసి ఆ తర్వాత తెలుగు స్టార్ట్ చేసాడు. తమిళ్ వర్షన్ లో లేని ఫైట్స్ .. మరియు పవన్ కళ్యాణ్ కు మాత్రమే సూట్ అయ్యే సీన్స్ మన తెలుగు వర్షన్ లో కలిపారు. తమిళ్ ఎవరేజ్/హిట్ రేంజ్ తో సరిపెట్టుకున్న ఖుషి, తెలుగు లో సంచనాలు సృష్టించింది.
పవన్ కళ్యాన్ 'తమ్ముడు' లో సైకిలింగ్ తీసేసి బాక్సింగ్ పెట్టడంతో పాటు భారీ మార్పులే చేసారు. అమీర్ ఖాన్ jo jeeta wohi sikandar సినిమా నచ్చిన అమీర్ ఖాన్ ఫేవరెట్స్ కు కూడా తమ్ముడు పిచ్చపిచ్చగా నచ్చేసింది.
అదే రీతిలో 'దబాంగ్' రీమేక్ 'గబ్బర్ సింగ్' కూడా భారీ మార్పులు చేసారు. ఎంత భారీ మార్పులు అంటే మన 'గబ్బర్ సింగ్' లో కొన్ని సీన్స్ 'దబాంగ్' సీక్వల్ 'దబాంగ్-2' లో వాడుకుంటున్నారు.అన్ని మార్పులు చేసిన సినిమాను కాపి అంటే ఎవరికైనా కాలుద్ది మరి.
ఒక కామన్ మెన్ చేసిన కామెంట్ కు హరీష్ శంకర్ అంతలా రియేక్ట్ అవ్వాల్సిన పని లేదని విమర్శలు వినిపిస్తున్నా , నాకు మాత్రం రిప్లై బాగా నచ్చింది. కారణం తమ్ముడు, ఖుషి సినిమాలను ఎవరైనా రిమేక్స్ అన్నప్పుడు నేను ఎలా ఫీల్ అవుతానో, ఆ ఫీల్ హరీష్ శంకర్ రిప్లై లో వినిపించింది.
No comments:
Post a Comment